Mothkur | సేవకుడిగా వస్తున్నా… ఆశీర్వదించి గెలిపించండి..

Mothkur | సేవకుడిగా వస్తున్నా… ఆశీర్వదించి గెలిపించండి..
Mothkur | మోత్కూర్, ఆంధ్రప్రభ : సామాజిక సేవలో ముందున్నా.. ప్రజా సేవకు అంకితమౌతా.. ఒక్క సారి అవకాశం ఇచ్చి 5 వ వార్డ్ కౌన్సిలర్ గా గెలిపించాలని బీఆర్ఎస్ అభ్యర్థి కోక రేణుక బిక్షం ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. కె బి ఆర్ ఫౌండేషన్ పేరుతో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి, పేదలకు అండగా నిలిచానని.. మున్సిపల్ ఎన్నికల్లో తమను ఒక్కసారి ఆశీర్వదించి 5 వ వార్డ్ కౌన్సిలర్ గా గెలిపిస్తే.. ప్రజాసేవకు అంకితమౌతామని కోరుతున్నారు. 5వ వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని, అన్ని రంగాల్లో వార్డును అభివృద్ధి పరచి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని హామీ ఇస్తున్నారు. వార్డ్ ఇంఛార్జీలు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నేవురి ధర్మేంధర్ రెడ్డి, మలిపెద్ది రాజిరెడ్డి, సింగిల్ విండో మాజీ డైరెక్టర్ సామ పద్మారెడ్డి నేతృత్వంలో 5 వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో విస్తృత ప్రచారం నిర్వహిస్తూ ప్రచార పర్వంలో ముందుకెళ్తున్నారు.
