Mother Dairy | మదర్ డెయిరీ చైర్మెన్ రాజీనామా చేయాలి

Mother Dairy | మదర్ డెయిరీ చైర్మెన్ రాజీనామా చేయాలి

  • పాల బిల్లులు వెంటనే చెల్లించాలి
  • మదర్ డెయిరీ ముందు పాల సంఘం చైర్మెన్ ల ధర్నా
  • చైర్మనుకు వ్యతిరేకంగా డైరెక్టర్ల నోటీసులు

Mother Dairy | యాదాద్రి, ఆంధ్రప్రభ : మదర్ డెయిరీని(Mother Dairy) అప్పుల పాలు చేసి, పాడి రైతుల బిల్లులు చెల్లించకుండా ఇష్టారాజ్యాంగ వ్యవహారిస్తున్న చైర్మెన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి రాజీనామా చేయాలనీ కోరుతూ ఈ రోజు హయత్ నగర్ మదర్ డెయిరీ ముందు డైరెక్టర్లు సందిల భాస్కర్ గౌడ్, కస్తూరి పాండు, అలివేలు రంగారెడ్డి, మాజీ చైర్మెన్ లింగాల శ్రీకర్ రెడ్డి, మాజీ డైరెక్టర్లు దొంతిరి సోమిరెడ్డి, బిక్షపతిల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. చైర్మెన్ మధుసూదన్ రెడ్డి రాజీనామా చేయాలనీ భారీ నినాదాలు చేశారు.

ఉమ్మడి నల్లగొండ – రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార యూనియన్ లిమిటెడ్(నార్ముల్) లో మళ్లీ లుకలుకలు బయటపడ్డాయి. చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డిపై పాలకవ ర్గంలో అసమ్మతి జ్వాలలు ఎగిసిపడ్డాయి. చైర్మన్ను కుర్చీ నుంచి దింపడమే లక్ష్యంగా డైరెక్టర్లు(Directors) భీష్మించారు. తాజాగా మదర్ డెయిరీ ఎండీకి డైరెక్టర్లు నోటీసులు అందించడంతో రాజకీయ రగడ జోరందుకుంది. ఈ నెల 7న తర్వాత అసమ్మతి సమావేశానికి ఆస్కారం ఉండటంతో డెయిరీ రాజకీయం రసవత్తంగా మారింది. మరోవైపు కొత్త చైర్మన్ పక్కా అనే ప్రచారం జోరందుకుంది.

Leave a Reply