అసెంబ్లీలో గళం విప్పిన ఎమ్మెల్యే బొజ్జపటేల్

అసెంబ్లీలో గళం విప్పిన ఎమ్మెల్యే బొజ్జపటేల్
ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అసెంబ్లీలో టైగర్ జోన్ వల్ల గిరిజనులకు జరిగే విషయాలపై గళం విప్పారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఖానాపూర్ నియోజవర్గంలో టైగర్ జోన్ వల్ల ఇందిరమ్మ ఇల్లు, రోడ్లునిర్మించకుండా అటువై శాఖ అధికారుల అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే అన్నారు. దీంతో ఇందిరమ్మ ఇల్లు నిర్మించకుండా అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారని ఈ విషయంలో ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
అటవీ అధికారుల అద్దంకి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు ఆగిపోవడంపై అటవీ శాఖ మంత్రి జిల్లా ఇన్చార్జి మంత్రి దృష్టికి తీసుకువెళ్లానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. టైగర్ జూన్ వల్ల గిరిజనులకు అన్యాయం జరగకుండా రెవెన్యూ అటవీశాఖ అధికారులతో జాయింట్ సర్వే చేయించాలని ఎమ్మెల్యే కోరారు.
