Minister | వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి …

Minister | వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి …
Minister | మోత్కూరు, ఆంధ్రప్రభ : నల్లగొండ డీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన పున్న కైలాస్(Punna Kailas) నేతపై రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komati Reddy Venkat Reddy) చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని బీసీ రిజర్వేషన్ సాధన సమితి మండల అధ్యక్షుడు శివార్ల శ్రీనివాస్ యాదవ్ కోరారు.
ఈ రోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన బడుగు బలహీన వర్గాలకు చెందిన పున్న కైలాస్ నేతకు నల్లగొండ డీసీసీ అధ్యక్షుడుగా ఇవ్వొద్దని సీఎం, కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి వెంకట్ రెడ్డి లేఖలు వ్రాయడం బీసీలను అవమాన పర్చడమేనన్నారు.
నాలుగేళ్ల క్రితం మునుగోడు ఉప ఎన్నికల సందర్భంలో కైలాస్ నేత మాట్లాడిన వీడియోను ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ(Congress Party)లో కొంతమంది నాయకులు లీకులు చేసి కైలాస్ నేతను తప్పుదోవ పట్టించే విధంగా కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు ఎన్నికల సమయంలో మంత్రి వెంకట్ రెడ్డిపై మాట్లాడిన కైలాస్ నేత ఆ సమయంలో క్షమాపణలు కూడా చెప్పారని, మరొకసారి రెండు రోజుల క్రితం మంత్రికి క్షమాపణలు చెప్పినప్పటికీ మంత్రి వెంకట్ రెడ్డి డీసీసీ అధ్యక్షుడిగా కైలాస్ నేతకు అవకాశం ఇవ్వొద్దని అధిష్టానానికి లేఖలు వ్రాయడం సరైన నిర్ణయం కాదన్నారు.
నల్లగొండ జిల్లా(Nalgonda District) కేంద్రంలో బీసీ ఓట్లు లేనిది వెంకట్ రెడ్డి గెలిచారా అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా డీసీసీ అధ్యక్షుడు కైలాస్ నేత విషయంలో మంత్రి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో బీసీ రిజర్వేషన్ సాధన సమితి మండల నాయకులు కోల మహేష్ చిల్లర గణేష్, ప్రశాంత్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
