Health Checkup |పవన్ కల్యాణ్ కు అపోలో ఆసుపత్రిలో వైద్య పరీక్షలు
హైదరాబాద్ – రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ రోజు హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్నారు. స్కానింగ్, తత్సంబంధిత పరీక్షలు నిర్వహించారు. రిపోర్ట్స్ పరిశీలించిన వైద్యులు పలు సూచనలు చేశారు. మరికొన్ని వైద్య పరీక్షలు అవసరం ఉంది.
ఈ నెలాఖరునగానీ, మార్చి మొదటి వారంలోగానీ మిగిలిన వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు. కాగా . 24వ తేదీ నుంచి మొదలయ్యే బడ్జెట్ సమావేశాలకు పవన్ కళ్యాణ్ హాజరు కానున్నట్లు డెప్యూటీ సిఎం కార్యాలయ సిబ్బంది తెలిపారు