RR vs GT | గిజ‌రాత్ విధ్వంసం.. రాజ‌స్థాన్ ముందు భారీ టార్గెట్

జైపూర్ వేదికగా ఈరోజు రాజస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ జట్టు చెలరేగింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన గుజరాత.. నిర్ణీత ఓవర్లలో కేవలం 4 వికెట్ల నష్టానికి 10.45 రన్ రేట్ తో 209 పరుగులు బాదింది. గుజరాత్ ఇన్నింగ్స్ లో ఓపెన‌ర్ సాయి సుద‌ర్శ‌న్ (39) ప‌రుగులు సాధించ‌గా.. కెప్టెన్ శుభమన్ గిల్ (50 బంతుల్లో 84), జోస్ బ‌ట్ల‌ర్ (26 బంతుల్లో 50) విధ్వంసం సృష్టించారు.

ఇక రాజ‌స్థాన్ బౌల‌ర్ల‌లో మహేష్ తీక్షణ రెండు వికెట్లు తీయ‌గా.. జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ త‌లా ఒక వికెట్ ప‌డ‌గొట్టారు. ఇక 210 ప‌రుగుల భారీ టార్గెట్ లో రాజ‌స్థాన్ ఛేజింగ్ కు దిగ‌నుంది.

Leave a Reply