Grocery Store | సింహం మాస్క్ ధరించి…

Grocery Store | సింహం మాస్క్ ధరించి…

Grocery Store | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : అనంతపురం జిల్లాలో వినూత్న దొంగతనం వెలుగులోకి వచ్చింది. సీసీ కెమెరాలకు చిక్కకుండా ఉండేందుకు సింహం మాస్క్ ధరించిన దొంగ కిరాణా షాపులో చోరీ చేయడం సంచలనంగా మారింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా పామిడి మండల కేంద్రంలో విచిత్రమైన దొంగతనం జరిగింది. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు ఓ దొంగ సింహం మాస్క్ ధరించి కిరాణా దుకాణంలో చోరీకి పాల్పడ్డాడు. ఇటీవల ప్రతి షాపులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో దొంగలు తమ గుర్తింపును దాచుకునేందుకు కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ దొంగ సింహం మాస్క్ ధరించి దుకాణంలోకి ప్రవేశించాడు.

షాపులో ఉన్న నగదు, సరుకులను దొంగిలించి ఎవరూ గుర్తించకముందే అక్కడి నుంచి పరారయ్యాడు. మరుసటి రోజు దుకాణానికి వచ్చిన యజమాని డబ్బు, సరుకు గల్లంతైనట్లు గమనించాడు. సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించగా సింహం మాస్క్ ధరించిన వ్యక్తి దొంగతనం చేస్తున్న దృశ్యాలు కనిపించడంతో యజమాని ఆశ్చర్యానికి గురయ్యాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply