Heroine Imanvi l క్రేజీ స్టార్‌తో హీరోయిన్ ఇమాన్వి సినిమా?

Heroine Imanvi l క్రేజీ స్టార్‌తో హీరోయిన్ ఇమాన్వి సినిమా?
- ప్రభాస్ ఫౌజీతో వైరల్ అయిన హీరోయిన్ ఇమాన్వి
- ఇమాన్వి ఎవరు? సోషల్ మీడియాలో ఆమెకు వచ్చిన క్రేజ్
- ఫౌజీ రిలీజ్ కాకుండానే క్రేజీ ఆఫర్స్
- పవన్ కళ్యాణ్ మూవీలో ఇమాన్వి ఎంట్రీపై ప్రచారం
Heroine Imanvi l ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా విభిన్న కథా చిత్రాల దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తోన్న మూవీ ఫౌజీ. ఈ మూవీలో ప్రభాస్ కు జంటగా ఇమాన్వి నటిస్తున్నట్టుగా అనౌన్స్ చేయడం.. వెంటనే ఈ బ్యూటీ వైరల్ అవ్వడం జరిగింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా రిలీజ్ కాకుండానే.. ఈ అమ్మడు మరో లక్కీ ఛాన్స్ దక్కించుకుందని.. మరో స్టార్ మూవీలో నటించే అవకాశం దక్కించుకుందని వార్తలు వస్తున్నాయి. అసలు ఇమాన్వి ఎవరు..? ఆమెకు లేటెస్ట్ గా వచ్చిన బంపర్ ఆఫర్ ఏంటి..?

ఇమాన్వి ఢిల్లీ అమ్మాయి. మంచి డ్యాన్సర్. ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఫస్ట్ మూవీనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మూవీలో నటించే ఛాన్స్ దక్కించుకోవడం విశేషం. ప్రభాస్ కు జంటగా నటిస్తుందని అనౌన్స్ చేసిన వెంటనే సోషల్ మీడియాలో ఈ బ్యూటీ ఫోటోలు వైరల్ అయ్యాయి. ఆమెను చూడగానే సౌందర్యలా కనిపిస్తుందని.. పెద్ద స్టార్ హీరోయిన్ అవుతాదని కామెంట్లు వినిపించాయి. ఆమె ఫోటోలు నెట్టింట ట్రెండింగ్ లో నిలిచాయి. ఈ మూవీ రిలీజ్ తర్వాత ఇమాన్వికి భారీగా ఆఫర్స్ వస్తాయని వార్తలు వచ్చాయి.

అయితే.. ఫౌజీ రిలీజ్ కాకుండానే ఇమాన్వికి క్రేజీ ఆఫర్స్ వస్తుండడం విశేషం. ఇంతకీ విషయం ఏంటంటే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఓ భారీ చిత్రం చేస్తున్నారు. దీనికి వక్కంతం వంశీ కథ అందించారు. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వచ్చేందుకు రెడీ అవుతుంది. అయితే.. ఈ సినిమాలో పవర్ స్టార్ కు జంటగా నటించేందుకు ఇమాన్విని తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉన్న ఇమాన్వి పవన్ మూవీలో నటిస్తుందనే వార్తతో మరింత బజ్ క్రియేట్ అయ్యింది. ఇదే కనుక నిజమైతే.. ఈ అమ్మడుకు బంపర్ ఆపరే.


