విద్యుత్ మోటార్ ఏర్పాటు

విద్యుత్ మోటార్ ఏర్పాటు

వేంసూరు, ఆంధ్రప్రభ : తరుసూ విద్యుత్ మోటారు కాలిపోతుండటంతో నూతన విద్యుత్ మోటారు ఏర్పాటు చేశారు. లచ్చన్నగూడెం సర్పంచ్ పోతురాజు చక్రధరరావు గ్రామంలో నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని, త్రాగునీటి సమస్య తలెత్తకుండా నివారణలో భాగంగా విద్యుత్ మోటారు కొనుగోలు చేసి నీటి కష్టాలకు చెక్ పెట్టారు.

ఇప్పటికే గ్రామంలో పైపులైన్ లీకేజీలు, చేతిపంపుల మరమ్మత్తులు చేపట్టారు. వేసవిలో నీటి ఇబ్బందులు రాకుండా, గ్రామ ప్రణాళికను తయారు చేసి, అందుకు అనుగుణంగా ముందుకు పోతున్నారు. పారిశుద్ధ్య నిర్వహణ, దోమల నివారణ, విద్యుత్తులో వోల్టేజ్ సమస్యలు తగ్గించేందుకు నూతన ట్రాన్స్ ఫార్మర్స్ ఏర్పాటు చేశారు.

Leave a Reply