Drug | ఒకే ఒక్కడు

Drug | ఒకే ఒక్కడు


Drug | ఆంధ్రప్రభ, ప్రతినిధి, హనుమకొండ : వరంగల్, హనుమకొండ 2 జిల్లాలకు కలిపి ఔషధ నియంత్రణ పరిపాలన కార్యాలయానికి ఒకే ఒక్క అధికారి పనిచేస్తున్నారు. ఆయన కార్యాలయంలో ప్రభుత్వ (GOVT) నిబంధనలతో పనిలేదు. ఆయన నిబంధనల ప్రకారమే విధులు కొనసాగుతాయి. సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు 10: 30 నిమిషాలకు విధులకు హాజరవుతారు.

కానీ ఈ కార్యాలయంలో 11:15 దాటినా పట్టించుకునే దిక్కు.. ముక్కు ఉండదు. ఇదే పరిస్థితి ప్రతిరోజూ కొనసాగుతోంది. ఇతరత్రా అవసరాల నిమిత్తం కార్యాలయానికి వచ్చేవారు ఎదురుచూడక తప్పడం లేదు. ఎవరైనా ప్రశ్నించాలని ప్రయత్నిస్తే ఫలితం కనిపించదు. ఎందుకంటే సంబంధిత అధికారి ఎప్పుడు తనిఖీల్లోనే (inspections) ఉంటారు. ఎవరిని ప్రశ్నించాలో ఎవరికి తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది.

Leave a Reply