మంచినీటిని వృధా చేయరాదు..

మంచినీటిని వృధా చేయరాదు..
మంథని, ఆంధ్రప్రభః మంచినీటిని వృధా చేయరాదని, పట్టణ అభివృద్ధికి పురపాలక ప్రజలు సహకరించాలని మంథని మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ సహేందర్ రెడ్డి పేర్కొన్నారు. గోవుల యజమానులు సోమవారం నిర్వహించే ప్రత్యేక సమావేశంలో పాల్గొనాలని సూచించారు. గోవుల యజమానులు సమావేశానికి రానిపక్షంలో రోడ్లపైన సంచరించే గోవులను గోశాలలకు తరలించబడునని వారు తెలిపారు.
రాబోయే వేసవి కాలనీ దృష్టిలో పెట్టుకొని పట్టణ ప్రజలు అత్యంత జాగ్రత్తగా నీటిని వాడుకోవాలని సూచించారు. నల్లాల నుండి నీటిని పట్టుకున్న తర్వాత ప్రజలు నల్లాలు ఆఫ్ చేసుకోని పొదుపుగా నీటిని వాడుకోవాలని సూచించారు. భవిష్యత్ తరాలకు నీటి వనరులు అందజేసే బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని గుర్తు చేశారు.
