Dimple Hayathi| రవితేజ హీరోయిన్ గ్లామర్ అదుర్స్

Dimple Hayathi| రవితేజ హీరోయిన్ గ్లామర్ అదుర్స్
ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : డింపుల్ హయాతి తెలుగు, తమిళ మరియు హిందీ చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్న భారతీయ నటి. 2017లో ‘గల్ఫ్’ సినిమాతో తెరంగేట్రం చేసిన ఆమె, డస్కీ బ్యూటీగా, సోషల్ మీడియాలో తన గ్లామరస్ ఫోటోషూట్లతో తరచుగా వార్తల్లో నిలుస్తుంటారు. గద్దలకొండ గణేష్, ఖిలాడి వంటి చిత్రాలలో ఆమె పాత్రలు గుర్తింపు తెచ్చాయి.

హీరోయిన్ డింపుల్ హయతి రవితేజతో భర్త మహాశయులకు విజ్ఞప్తి, ఖిలాడి సినిమాలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే యురేకా సినిమాలో కూడా నటించింది. గద్దలకొండ గణేష్ సినిమాలో “జర్రా జర్రా” అనే స్పెషల్ సాంగ్ చేసి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇక ఖిలాడి సినిమాతో హీరోయిన్గా మారి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. అలాంటి ఈమె 2023లో రామబాణం అనే సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా పెద్దగా విజయాన్ని అందించలేదు. దీంతో రెండేళ్లు ఇండస్ట్రీకి గ్యాప్ తీసుకొని డింపుల్ భర్త మహాశయులకు విజ్ఞప్తితో సినిమాలో నటించింది.

ఓ ఈవెంట్లో డింపుల్ హయతి తన గురించి వివరించింది. “స్వర్గీయ దర్శకులు దాసరి నారాయణరావు నాకు తాతగారు అవుతారు. అలాగే ప్రముఖ సీనియర్ నటి ప్రభ నాకు నానమ్మ అవుతారు. అలాగే చాలామంది నటీనటులు మా ఇంటి నుండి ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇక నేను ఇండస్ట్రీలోకి వస్తానని చెప్పినప్పుడు వీరంతా కూడా అడ్డుపడ్డారు. కానీ నేను ఇండస్ట్రీలోకి రావాలని పట్టుబట్టడంతో నా కోరికను కాదనలేక నన్ను ప్రోత్సహించారు. అయితే వీరి బ్యాక్ గ్రౌండ్ ఉపయోగించుకొని.. ఇండస్ట్రీలోకి వచ్చి అవకాశాలు అందుకోవాలని నేను అనుకోలేదు. అందుకే నా బ్యాక్ గ్రౌండ్ గురించి ఎక్కడ కూడా ఎవరికీ చెప్పలేదు” అంటూ క్లారిటీ ఇచ్చింది డింపుల్ హయతి. మొత్తానికి అయితే దాసరి నారాయణరావు గారి మనవరాలు అని తెలియడంతో ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం డింపుల్ హయతికి సంబంధించిన ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.






















