విరాళాలతో అభివృద్ధి పనులు

విరాళాలతో అభివృద్ధి పనులు
కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ : మంగళవారం పౌర్ణమిని పురస్కరించుకుని వంటశాల, మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్మాణానికి ఘనంగా శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా(Nizamabad District) కమ్మర్ పల్లి మండలంలోని ఉప్లూర్ శ్రీ షిరిడి సాయి దేవాలయం వద్ద వంటశాల, భక్తుల సౌకర్యార్థం మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్మాణానికి ఆలయ అభివృద్ధి కమిటీ(Committee) ఆధ్వర్యంలో శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. భక్తులు అందించిన విరాళాల(Donations)తో వంటశాల, మరుగుదొడ్లు, మూత్రశాలలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. భక్తులు అందించే విరాళాలు, ఆర్థిక చేయూతతో ఆలయాన్నిఅభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళుతున్నట్లు వారు తెలిపారు.
త్వరితగతిన నిర్మాణాలను పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు వివరించారు. అనంతరం పౌర్ణమిని(Full Moon) పురస్కరించుకొని ఆలయం వద్ద వితరణ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ షిరిడి సాయి(Shri Shirdi Sai) ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పోలేపల్లి లచ్చయ్య(Polepalli Lachchaiah), బద్దం గంగారెడ్డి, యెనుగందుల శశిధర్, పెంబర్తి నరేష్ కుమార్, పోతు మురళి, పోతు గణేష్, మహిళా సంఘాల సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
