కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా జిల్లా కో-ఆర్డినేటర్‌గా దేవసాని ఆనంద్‌

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం కో-ఆర్డినేటర్‌గా బెల్లంపల్లి పట్టణంలోని టేకులబస్తీకి చెందిన సీనియర్ కాంగ్రెస్ లీడర్ దేవసాని ఆనంద్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు రాష్ట్ర సోషల్ మీడియా సెక్రెటరీ వినయ్ నియామకపు పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తానని పేర్కొన్నారు.

రానున్న రోజుల్లో రాహుల్ గాంధీని దేశ ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యంగా, రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వచ్చేలా కృషి చేస్తానని వెల్లడించారు. మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ, మండల కో-ఆర్డినేటర్లను సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతానికి శ్రమిస్తానని తెలిపారు. తనపై నమ్మకం ఉంచి ఈ పదవిని అప్పగించిన రాష్ట్ర సోషల్ మీడియా చైర్మన్ మన్నే సతీష్, రాష్ట్ర సెక్రటరీ వినయ్‌లకు ఆనంద్ కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply