ట్రిపుల్ ఐటీ లో నాగుపల్లికి డబుల్

ట్రిపుల్ ఐటీ లో నాగుపల్లికి డబుల్

గ్రామంలో సంబరాలు..

దమ్మపేట, ఆంధ్రప్రభ : దమ్మపేట మండలం నాగుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు మేకా మాన్విత ,చాపా నాగ దినేష్ లు ట్రిపుల్ ఐటీ కి ఎంపికయ్యారు .తెలంగాణ రాష్ట్రంలో గత ఏప్రిల్ లో విడుదల చేసిన పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో దమ్మపేట మండలం నాగుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన మేకా మాన్విత 571 మార్కులతో మండల టాపర్ గా నిలిచిన మేకా మాన్విత , అదే పాఠశాలకు చెందిన చాపా నాగ దినేష్ లు బాసర ట్రిపుల్ ఐటీ లో సీటు సాధించారు.

మేకా మాన్విత, చాపా నాగ దినేష్ లు ట్రిపుల్ ఐటీ లో సీటు సాధించటం పట్ల దమ్మపేట మండల విద్యాధికారి జగపతి , నాగుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బజ్జూరి సరళ , మండల , గ్రామ ప్రజలు విద్యార్థినిని అభినందించారు .



Leave a Reply