నంద్యాలలో కార్డన్ అండ్ సెర్చ్..

నంద్యాలలో కార్డన్ అండ్ సెర్చ్..

నేర నియంత్రణలో భాగంగా కార్డెన్ అండ్ సర్చ్ ఆపరేషన్స్ నిర్వహణ..
చట్టవ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు..

నంద్యాల, ఆంధ్రప్రభః నేర నియంత్రణ ప్రజల భద్రత, రక్షణే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశాల మేరకు పలు పోలీస్ స్టేషన్ పరిధిలోని సమస్యత్మక గ్రామమైన పెసరవాయి నందు పట్టణ కేంద్రంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బయటిపేట నందు ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి , సబ్ ఇన్స్పెక్టర్ నాగార్జున రెడ్డి వారి సిబ్బంది సహాయంతో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.

ఈ సందర్భంగా రౌడీ షీటర్లు, నేర చరిత్ర గలవారు అనుమానితుల ఇళ్లలో సోదాలు చేయడంతో పాటు ముఖ్య ప్రదేశాలలో వాహనాల తనిఖీలు నిర్వహించడం ద్వారా సరైన ధ్రువపత్రాలు లేని పలు వాహనాలను చట్ట వ్యతిరేకంగా విక్రయిస్తున్న మద్యం బాటిల్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్‌ ప్రధాన ఉద్దేశ్యం నేరాలను ముందస్తుగా అరికట్టి, ప్రజల రక్షణ,భద్రతా వాతావరణాన్ని బలోపేతం చేయడం. ప్రతి ప్రాంతంలో పోలీసుల సాన్నిధ్యం స్పష్టంగా కనిపించేలా చర్యలు తీసుకోవడం ద్వారా అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలను నిరోధించడమే ముఖ్య లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు.

అనంతరం గ్రామ,వార్డు ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసి ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సైబర్ నేరాల గురించి రోడ్డు ప్రమాదాలు నివారణకు తీసుకోవలసిన చర్యలు, మహిళలు చిన్నపిల్లలపై జరిగే నేరాలపై అవగాహన కల్పిస్తూ అప్రమత్తంగా ఉండాలని,ఏదైనా సమస్య ఉంటే వెంటనే పోలీసు వారిని సంప్రదించాలని, మీ ప్రాంతాలలో అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసు వారికే సమాచారం అందించాలని, ఏదైనా అత్యవసర సమయంలో పోలీస్ వారి సహాయం కొరకు 112 లేదా 100 టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేసి తక్షణ సహాయం పొందవచ్చునని తెలియజేశారు.

Leave a Reply