మంచు విష్ణుకు కాంగ్రెస్ ఫిర్యాదు

మంచు విష్ణుకు కాంగ్రెస్ ఫిర్యాదు

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : జాతిపిత మహాత్మగాంధీపై (Mahatma Gandhi remarks) యాక్టర్ శ్రీకాంత్ అయ్యంగార్ (Srikanth Iyengar) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆయనపై కఠిన చర్యలు(strict measures) తీసుకోవాలని నిన్న సైబర్ సెల్ పోలీసులకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మూవీ ఆర్ట్స్ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేసింది.

ఈ మేరకు ఇవాళ మా అధ్యక్షుడు మంచు విష్ణుకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్(Balmuri Venkat) ఫిర్యాదు చేశారు. శ్రీకాంత్ అయ్యంగార్ తీరు తీవ్ర అభ్యంతరకరం అని ఆయన మా సభ్యత్వం రద్దు చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బల్మూరి వెంకట్.. శ్రీకాంత్ అయ్యంగార్ విషయంలో సినీ పెద్దలు సైతం స్పందించాలని వ్య‌క్తం చేశారు.

Leave a Reply