విద్య, బోధన సౌకర్యాలపై కలెక్టర్ ఆరా..

జైనూర్, ఆంధ్రప్రభ ; కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె హరిత శుక్రవారం జైనూర్ మండలంలోని రాసిమెట్ట బాలికల ఆశ్రమోన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ మొదట ఆశ్రమోన్నత పాఠశాలలోని కూరగాయలస్టోర్ రూమ్, మరుగుదొడ్లు,బాత్ రూమ్ లను పరిశీలించారు. అనంతరం పాఠశాలలో నీటి వసతి, మెనో ప్రకారంగా భోజన వసతి కల్పిస్తున్న రాలేదా అని విద్యార్థులతో అడిగి తెలుసుకున్నారు.

విద్య బోధన సరిగా జరుగుతుందా లేదా ఉపాధ్యాయులు సమయ వేళలు పాటిస్తున్నరా, లేదా అనే విషయాలపై విద్యార్థులతో ఉపాధ్యాయులతో కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని 100% ఫలితాలు వచ్చేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ కె హరిత కోరారు. విద్యార్థుల ఆరోగ్య విషయాల పట్ల శ్రద్ధ చూపాలని, ఉపాధ్యాయులు సమయవేలల పాటించాలని కలెక్టర్ అన్నారు.

కలెక్టర్ తనిఖీ చేసే సమయంలో పాఠశాలప్రధానోపాధ్యాయులు అనిత లేకపోవడంతో హెచ్ఎం ఎటు వెళ్లారని కలెక్టర్ ఉపాధ్యాయులకు అడగగా హెచ్ఎం కుమార్ కి జ్వరం రావడంతో ఇప్పుడే ఆసుపత్రికి వెళ్లిందని తెలిపారు. ఉపాధ్యాయులు విద్య బోధన సక్రమంగా బోధిస్తున్నారని కలెక్టర్ విద్యార్థులతో అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు కష్టపడి ఇష్టపడి ఒక లక్ష్యంతో చదువుకోవాలని కలెక్టర్ విద్యార్థులకు కోరారు. కలెక్టర్ ఆకస్మిక తనిఖీతో పాఠశాల ఉపాధ్యాయులు హ డలెత్తిపోయారు. కలెక్టర్ తనిఖీ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, వర్కర్లు విద్యార్థినీలు పాల్గొన్నారు.

Leave a Reply