AP పిన్నాపురం ప్రాజెక్టు సైట్ ను పరిశీలించిన కేంద్రమంత్రి

కర్నూలు బ్యూరో – కర్నూలు జిల్లా, ఓర్వకల్లు మండలంలోని గని సోలార్ పార్క్ ను కేంద్ర కన్జ్యూమర్స్ అఫైర్స్, ఫుడ్ ,పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, న్యూ, రెన్యువబుల్ ఎనర్జీ మంత్రి ప్రహ్లాద్ జోషి సందర్శించారు. అనంతరం పిన్నాపురం ప్రాజెక్ట్ సైట్ ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన కేంద్ర మంత్రి. అంతకుముందు కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు కార్యాలయానికి వ‌చ్చిన‌ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జ్యోషిని మంత్రిని స‌త్క‌రించారు.. వెంకటేశ్వర స్వామి ప్రతిమను జ్ఞాపిక‌గా అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా అనంతరం జిల్లాలోని పలు సమస్యలపై కేంద్ర మంత్రికి నాగరాజు వినతిపత్రం సమర్పించారు. కూటమి నేతల ఐక్యంగా ఉంటూ కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి ఎంపికి సూచించారు.

Leave a Reply