అలెర్ట్.. తిరుపతి ప్రజలకు కలెక్టర్ సూచన

  • సీఎం పర్యటన నేపథ్యంలో పీజీఆర్ఎస్ రద్దు

తిరుపతి కలెక్టరేట్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో జూన్ 8న నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా రద్దు చేసినట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. జూన్ 9న ముఖ్యమంత్రి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నందున జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు ఆయా కార్యక్రమాల ఏర్పాట్లు, విధుల్లో నిమగ్నమవుతున్నారని కలెక్టర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ కారణంగా ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ఈసారి నిర్వహించడం సాధ్యంకాకపోవడంతో రద్దు చేసినట్లు వెల్లడించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ విజ్ఞప్తి చేశారు.