ప్రచారంలో దూసుకుపోతున్న చందనగిరి శ్రీనివాస్ లావణ్య

క్యాతన్ పల్లి, ఆంధ్రప్రభ ; క్యాతన్ పల్లి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 17వార్డు కాంగ్రెస్ అభ్యర్తి చందనగిరి శ్రీనివాస్ లావణ్య వార్డు ప్రజలతో మమేకమై గడప గడపకు ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అభ్యర్థి మాట్లాడుతూవార్డు అభివృద్దే ప్రధాన లక్ష్యమని,వార్డు ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందుంటునని, నా సమస్యగా ఆలోచించి, నా సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయని అన్నారు.ఈ కార్యక్రమంలో డిసిసి ప్రెసిడెంట్ రఘునాథరెడ్డి, నమిలికొండ శీను, వార్డ్ ప్రజలు పాల్గొన్నారు.
