హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వేడుకలకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదపండితులు పంచాంగ శ్రవణం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేఆర్ సురేశ్ రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, పువ్వాడ అజయ్, బొల్లం మల్లయ్య యాదవ్, పార్టీ నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వేద పండితులు పంచాంగ శ్రవణం వినిపించారు. ఈ ఏడాది ప్రజాపాలన దృష్టి తక్కువగా పెట్టే స్థితి ఉందని ప్రముఖ పండితులు పంచాంగ శ్రవణం చెప్పారు. ఇంకా కొన్ని ఇబ్బందులు కూడా వస్తాయని అన్నారు. ప్రజాపాలనలో లోపం, గవర్నమెంట్ నడపడానికి కూడా ఇబ్బందులు ఏర్పడుతాయని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సహకారం రాష్ట్రం తీసుకోవడం సంపూర్ణంగా ఉండదన్నారు. అధికార దుర్వినియోగం చేసే అవకాశం ఉందన్నారు. వార్డు మెంబర్ నుంచి ఎమ్మెల్యే ఎంపీ స్థాయి వరకు వచ్చే ఏ ఎన్నికలైన బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉందని, కానీ రాజు ఎన్నికలు పెట్టడానికి ఇబ్బంది పడే స్థితి ఉందని, కోర్డులు మొట్టికాయలు వేస్తేనే ఎన్నికలు జరిగే స్థితి ఉంటుందని, ఎన్నికలు ఎక్కువగా వాయిదా పడే ఛాన్స్ ఉందని అన్నారు.
మాజీ సీఎం కేసీఆర్ జాతకంలో ఉచ్చస్థితి ఉందని అయ్యగారు చెప్పారు. ఈ ఏడాది సంపూర్ణ ఆరోగ్యం ఉంటుందని, తెలంగాణ ప్రజలు ఏ విధమైన ప్రజాపాలన కోరుకుంటున్నారో.. తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రిగా పట్టం కట్టడానికి అవకాశం ఉన్న సంవత్సరం ఇదని చెప్పుకొచ్చారు. కేసీఆర్ రాశీ ఫలాల్లో రాహువు అష్టమంలో ఉన్నప్పటికి అమ్మవారు, నరసింహ స్వామి అనుగ్రహం ఉందన్నారు.