Bonda Umamaheswara Rao | పోలియో చుక్కలు వేస్తున్న ఎమ్మెల్యే

Bonda Umamaheswara Rao | పోలియో చుక్కలు వేస్తున్న ఎమ్మెల్యే
- ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా అడుగులు….
- సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు….
- ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా టీడీపీ ప్రభుత్వం అడుగులు వేస్తున్నది…
Bonda Umamaheswara Rao | పాయకాపురం, ఆంధ్ర ప్రభ : సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. ఆదివారం పల్స్ పోలియో చుక్కలు కార్యక్రమం స్థానిక 59వ డివిజన్ సింగ్ నగర్లో గల వివేకానంద స్కూల్ ప్రాంగణంలో, 62వ డివిజన్ పాయకాపురం పరిధిలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పాల్గొని చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేశారు.ఈ సందర్భంగా బొండా ఉమ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్థ నాయకత్వంలో రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం విస్తృతమైన చర్యలు చేపడుతోందని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అభివృద్ధి, ఆధునిక వైద్య సదుపాయాల కల్పన వంటి కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.
పుట్టిన బిడ్డ నుండి ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ క్రమం తప్పకుండా పల్స్ పోలియో చుక్కలు వేయించడం ద్వారా పోలియో వ్యాధిని పూర్తిగా నివారించవచ్చని తెలిపారు. ఒక్క చిన్నారి కూడా పోలియో బారిన పడకూడదనే సంకల్పంతో దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని, సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి కమ్యూనిటీ హాల్, నాలుగు రోడ్ల సెంటర్లు, అలాగే ప్రతి ఇంటికీ వెళ్లి పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏ.ఎమ్. హెచ్. ఓ బాబు శ్రీనివాస్, డివిజన్ ఇంచార్జి పైడి శ్రీను, అధ్యక్షుడు జలకం రాజారావు, ఇంచార్జి మోత్కూరి కాసిం, సుర్వేపల్లి అమర్నాథ్ గౌడ్,రాజానా బంగారు నాయుడు,ఆకుల సూర్యప్రకాష్, బుదాల సురేష్,కంచేటి నాగరాజు,శనగల మరియా,ఖాదర్బి, డాక్టర్లు, పల్స్ పోలియో సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
