12వ వార్డు అభ్యర్థి గెలుపుకు బిజెపి రాష్ట్ర నాయకుల ప్రచారం

పరకాల, ఆంధ్రప్రభ : పరకాల పురపాలకు సంఘం సాధారణ ఎన్నికల్లో 12వ వార్డు బిజెపి అభ్యర్థి ఆకుల లావణ్య శ్రీధర్ గెలుపుకు బిజెపి రాష్ట్ర నాయకులు ప్రచారం విస్తృతంగా చేశారు. శనివారం రోజు సాయంత్రం పట్టణంలోని 12వ వార్డులో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ కాళీ ప్రసాద్ రావు, డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ 12వ వార్డు బిజెపి అభ్యర్థి ఆకుల లావణ్య శ్రీధర్ గెలుపుకు ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 12వ వార్డులో ఓటర్లు ఐక్యతతో బిజెపికి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. ఎలక్షన్ అంటేనే డబ్బు సంచులు, ఎలక్షన్లో పోటీ చేసే అభ్యర్థులను కొనుగోలు చేయటంగా మారిందని వారు అన్నారు. ఈ కుతంత్ర రాజకీయ నాయకుల పద్ధతి మారాలంటే ఓటర్లు అందరు ఐక్యతతో బిజెపి పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను ఓటు వేసి గెలిపించాలని వారు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
