యువశక్తి మారితేనే రాజకీయాల దిశ మలుపు

యువశక్తి మారితేనే రాజకీయాల దిశ మలుపు

  • భూపాల్ పల్లి జిల్లా నాయకులు కంకణాల దేవేందర్

చిట్యాల, ఆంధ్రప్రభ : యువశక్తి, మారితేనే రాజకీయాల దిశ మారుతుందని, జనసేనతో కలిసే ప్రతి యువకుడు, రేపటి తెలంగాణ అభివృద్ధి లో భాగస్వామి అవుతుందని జనసేన పార్టీ భూపాలపల్లి జిల్లా నాయకులు కంకణాల దేవేందర్ , అన్నారు. శనివారం ఆంధ్రప్రభతో ఆయన మాట్లాడుతూ.. అభిమానం ఒక్కటే కాదు, బాధ్యత కూడా తీసుకుందాం. పవన్ కళ్యాణ్ ఆశయాలకు బలం కావాలంటే — ప్రతి యువకుడు జనసైనికుడిగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ నెల 26 నుండి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం అవుతుందన్నారు.

పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించబడుతుందన్నారు. ఉమ్మడి వరంగల్ కో-ఆర్డినేటర్ దామోదర్ రెడ్డి సూచనలతో, జిల్లా నాయకులు జెర్రీ పొతుల సనత్ కుమార్ తో పాటు తన ఆధ్వర్యంలో చిట్యాల ప్రాంతంలో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు. ఈ ప్రాంతానికి చెందిన యువత, మహిళలు, పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రజలు జనసేన పార్టీ సభ్యత్వం తీసుకుని పార్టీ సిద్ధాంతాలను ప్రజలలోకి తీసుకెళ్లాలని కోరారు.

Leave a Reply