Bandi Bhagirath | పోక్సో కేసులో మధ్యంతర బెయిల్ నిరాకరణ

Bandi Bhagirath | పోక్సో కేసులో మధ్యంతర బెయిల్ నిరాకరణ

Bandi Bhagirath | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి భగీరథ్ కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న భగీరథ్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది.

ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి. భగీరథ్‌ను అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలని ఆయన తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టులో వాదనలు వినిపించారు.

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు పేర్కొంది. తదుపరి విచారణలో తుది ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేసింది. ప్రాథమిక సమాచారం ప్రకారం వచ్చే గురువారం హైకోర్టు తీర్పు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Leave a Reply