Avanigadda | సన్మార్గంలో పయనించాలి..

Avanigadda | సన్మార్గంలో పయనించాలి..

Avanigadda, ఆంధ్రప్రభ : ఏసు క్రీస్తు చూపిన సన్మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని.. ప్రముఖ పారిశ్రామికవేత్త, కూటమి నాయకులు విక్కుర్తి వెంకట శ్రీనివాసరావు పేర్కొన్నారు. అవనిగడ్డలోని ఒకటవ వార్డులో విక్కుర్తి వీర రాఘవయ్య ఫౌండేషన్ కార్యాలయంలో గురువారం ఉదయం క్రిస్మస్ పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాస్టర్ గాలం ప్రకాష్ పాల్ తొలుత కార్యక్రమంలో పాల్గొన్న వారికి క్రీస్తు సందేశాన్ని అందించారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారీ కేకును కట్ చేసారు. 300 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు.

అనంతరం విక్కుర్తి శ్రీనివాస్ రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఏసుక్రీస్తు తన బోధనల ద్వారా సమాజానికి చెప్పిన విధంగా ప్రతి ఒక్కరూ ప్రేమ, దయ, కరుణ, త్యాగం, సేవా గుణం వంటి వాటిని అలవర్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో విక్కుర్తి రాంబాబు, న్యాయవాది విక్కుర్తి రామకృష్ణ, పులిగడ్డ చంద్ర, పోతన ఆంజనేయులు, పోతన నాగరాజు, బర్మా శ్రీనివాసరావు, మేకా శ్రీనివాసరావు, బొప్పన రమణలతో పాటు పెద్ద సంఖ్యలో నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి తరలివచ్చిన ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply