AP | నిరుపయోగంగా ప్రభుత్వ భవనాలు..

AP | నిరుపయోగంగా ప్రభుత్వ భవనాలు..

AP, కృత్తివెన్ను, ఆంధ్రప్రభ : ప్రజల అవసరాలకు నిర్మించిన ప్రభుత్వ భవనాలు నిరుపయోగంగా మారి శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. వాటి ఆలనా పాలనా కరువు అవ్వడంతో పక్కా భవనాలు దెబ్బతింటున్నాయి. మండలంలో ఇలాంటి భవనాలు పదుల సంఖ్యలో దర్శనమిస్తున్నాయి. కృత్తివెన్ను మండలం చిన్నగొల్లపాలెం గ్రామంలో ఉన్న గ్రామ రెవిన్యూ అధికారి కార్యాలయ భవనం మూతపడటంతో ఇప్పుడు శిథిలావస్థకు చేరుకున్నాయి.

గ్రామంలోని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. గ్రామంలోని పశువులకు నివాసయోగ్యంగా మారింది. ప్రజా ధనాలకు సంబంధిత అధికారుల నిర్లక్ష్యం కారణంగా శిథిలవస్థకు చేరిన దౌర్భాగ్యం పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిరుపయోగంలో ఉన్న ప్రభుత్వ భవనాలను తిరిగి ఉపయోగంలోకి తీసుకురావాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Leave a Reply