AP CM | పురాణాలు యువతకు బోధించాలి

AP CM | పురాణాలు యువతకు బోధించాలి

  • సీఎం చంద్రబాబు నాయుడు

AP CM | తిరుపతి రూరల్ ఆంధ్రప్రభ : పురాణాల్లోని సాలాంసాన్ని యువతకు బోధించాలని, వాటి విలువలు యువతకు చెప్పాలని సీఎం చంద్రబాబునాయుడు (Cm Chandrababu Naidu) అన్నారు. భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ కృష్ణుని మహిమ, శివుడి మహాత్యం గురించి యువతకు తెలియ‌జేయాల‌న్నారు. రాముడికి మించిన పురుషోత్తముడు లోకంలో లేడని, రామరాజ్యాం గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఉంద‌న్నారు. మహాభారతం, రామాయణ గాథలు చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంద‌న్నారు. ఎవరు మంచివారో.. ఎవరు చెడు ఎప్పటికప్పుడు చెప్పగలిగితే వాటి వ్యత్యాసం తెలుస్తుందన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.

• సంస్కృతి, సంప్రదాయాలను నిలబెడుతూ.. దేశాభివృద్ధి కోసం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కృషి చేస్తున్నారు
• మన దేశం, భారతీయత గురించి చర్చించుకోవడానికి భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ మంచి వేదిక.
• ప్రాచీన కాలంలో భారతదేశం విజ్ఞానాన్ని సముపార్జించిన దేశంగా పరిఢవిల్లింది.
• ఎన్నో వేల ఏళ్ల క్రితమే అర్బన్ ప్లానింగ్ అంటే ఏమిటో హరప్పా నాగరికత చాటి చెప్పింది.
• 2900 ఏళ్ల క్రితమే యోగాభ్యాసం చేశాం… ప్రధాని మోదీ నేతృత్వంలో అంతర్జాతీయ యోగా దినోత్సవరం రికార్డు స్థాయిలో నిర్వహించాం.
• ఇవాళ యోగాను 150 దేశాలు సాధన చేస్తున్నాయి.
• 2600 ఏళ్ల క్రితమే భారత దేశం ఆయుర్వేదం ద్వారా వైద్య సేవలు అందించింది.
• పూర్వ కాలంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తక్షశిల విశ్వ విద్యాలయం నిర్మించుకున్న దేశం మనది.
• 1600 ఏళ్ల క్రితమే నలంద యూనివర్శిటీ ద్వారా ఆధునిక విద్యను అందించిన ఘనత మనది… సున్నాను భారతీయులే కనుగొన్నారు.
• మెదడుకు పదును పెట్టే చదరంగ క్రీడను కనిపెట్టిన ఘనత కూడా మన భారతీయులదే.
• వివిధ కీలక రంగాల్లో నైపుణ్యం సాధించిన నిపుణులు మన భారతదేశం సొంతం.
• అస్ట్రానమీలో ఆర్యభట్ట, గణితంలో భాస్కరాచార్య, వైద్యంలో చరక, ధన్వంతరి, ఆర్థిక శాస్త్రంలో కౌటిల్యుడు వంటి గొప్ప వారున్నారు… వీళ్లందరూ మనకు స్పూర్తిని కలిగించేలా చరిత్ర సృష్టించారు.

CLICK HERE TO READ సీఎం సార్‌.. స్వాగతం

CLICK HERE TO READ MORE

Leave a Reply