బిజెపి ఇంటింటి ప్రచార యాత్ర

బిజెపి ఇంటింటి ప్రచార యాత్ర
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని 3 వ వాటిలో బిజెపి అభ్యర్థి చిలుగురు ప్రచారపు చివరి రోజైన సోమవారం ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని కార్యకర్తలతో కలిసి చేపట్టారు. మోడీ సారధ్యంలోని బిజెపి ప్రభుత్వం ప్రజల కోసం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రచారం నిర్వహించి తనను గెలిపించవలసిందిగా కోరారు. పార్టీ జిల్లా, మండల, పట్టణ నాయకులు, ముఖ్యులు పాల్గొన్నారు.
