బురదలో దిగబడిన స్కూల్ బస్సు

బురదలో దిగబడిన స్కూల్ బస్సు
ఒరిగిన స్కూలు బస్సు..
విద్యార్థులకు తప్పిన ప్రమాదం !
మిర్యాలగూడ (ఆంధ్రప్రభ) : మిర్యాలగూడ పట్టణంలోని అగ్రిగోల్డ్ కాలనీ వద్ద సోమవారం ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు (school bus) విద్యార్థులను స్కూలుకు తీసుకెళ్తూ బురదలో ఇరుక్కుంది. అదుపు తప్పి బురదలో ఇరుక్కుని ప్రమాదపు అంచుకు వెళ్ళింది. ఒకవైపునకు ఒరిగిపోవడంతో అప్రమత్తంగా వ్యవహరించిన డ్రైవర్.. విద్యార్థులను బస్సు నుంచి దించి వేశారు.
