Gudimallam | పరశురామేశ్వరుడి సేవలో…

Gudimallam | పరశురామేశ్వరుడి సేవలో…
- సినీ నటుడు తనికెళ్ల భరణి
Gudimallam | ఏర్పేడు, ఆంధ్రప్రభ : మండలంలోని ప్రసిద్ధ శైవక్షేత్రమైన గుడిమల్లం శ్రీ ఆనందవల్లి సమేత శ్రీ పరుశురామేశ్వర స్వామిని ప్రముఖ సినీ నటుడు తనికెళ్ల భరణి దర్శించుకున్నారు. స్వామివారి దర్శనార్థం ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ చైర్మన్ బత్తల గిరినాయుడు, ఆలయ కార్యనిర్వాహణాధికారి రామచంద్రారెడ్డిలు సాదర స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం తనికెళ్ల భరణికి ఆలయ మర్యాదలతో తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయంలో ఏప్రిల్ 23వ తేదీన అంగరంగ వైభవంగా నిర్వహించనున్న మహా కుంభాభిషేకం గురించి చైర్మన్, అధికారులు ఆయనకు వివరించారు.
