Legal Services | ఒక క్షణం నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలి…

Legal Services | ఒక క్షణం నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలి…

  • జిల్లా ప్రధాన న్యాయమూర్తి బోయ శ్రీనివాసులు

Legal Services | నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఒక క్షణం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే నిండు ప్రాణం బలైపోతుందని, తద్వారా కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బోయ శ్రీనివాసులు అన్నారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్(Legal Services) అథారిటీ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవా అధికారి సంస్థ ఆధ్వర్యంలో “ఆన్ రోడ్ సురక్ష అభియాన్ స్పెషల్ క్యాంపెయిన్” కార్యక్రమంలో భాగంగా జిల్లా కోర్టు నుంచి సత్యనారాయణ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు.

ఈ ర్యాలీకి జిల్లా ప్రధాన న్యాయమూర్తి బోయ నివాసులు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రోడ్డు భద్రతా నియమాలు ప్రజల స్వేచ్ఛను పరిమితం చేయడానికి కాకుండా, వారి ప్రాణాలు, కుటుంబాల భవిష్యత్తును కాపాడేందుకే రూపొందించబడినవని తెలిపారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలని, ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

సిగ్నల్స్‌(Signals)ను పాటించడం, వేగ పరిమితులు దాటకపోవడం, హెల్మెట్‌లు, సీట్‌బెల్ట్‌లు తప్పనిసరిగా ధరించడం అత్యంత కీలకమని అన్నారు. అలాగే వాహనం నడుపుతూ మొబైల్ ఫోన్ వినియోగం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, ఆకస్మిక విన్యాసాలు వంటి ప్రమాదకర చర్యలను పూర్తిగా నివారించాలని హితవు పలికారు.

Legal Services |

ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి వింధ్య నాయక్, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి. ప్రభాకర్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కే. సురేష్, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ కే. లక్ష్మిపతి గౌడ్, ట్రాఫిక్ ఏఎస్సై కృష్ణ చైతన్య, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, న్యాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే సాయి స్కూల్, లిటిల్ స్టార్స్ స్కూల్, రవితేజ స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, పోలీసు అధికారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Leave a Reply