Consultation | మంత్రి వివేక్ వెంకటస్వామి పరామర్శ

Consultation | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : ఇటీవల మాతృ వియోగానికి గురైన అఖిల భారతయాదవ మహాసభ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు బండి సాధానందం యాదవ్, కాంగ్రెస్ మాజీమున్సిపల్ ఫ్లోర్ లీడర్, టీపీసీసీ వోబీసీ సెల్ వైస్ ఛైర్మెన్ బండి ప్రభాకర్ యాదవ్ ల కుటుంబాన్ని ఈ రోజు మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పరామార్శించారు. ఇటీవల వారి తల్లి బండి లింగమ్మ అనారోగ్యంతో మృతి చెందిన విషయాన్ని తెలులుసుకున్న మంత్రి బెల్లంపల్లిలోని గాంధినగర్ లోని బండి ప్రభాకర్ నివాసానికి వచ్చిన మంత్రి వారి సోదరులు రాజకొమురు, తిరుపతి, ఇతర కుటకుటుంభ సభ్యులను పరమార్శించి ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలిపారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ… 90 ఏళ్ల వయస్సులోను ఎంతో ఆక్టివ్ గా ఉన్న లింగమ్మ అందరికీ ఆదర్శప్రాయురాలుగా జీవించి పెద్ద కుటుంబాన్ని భుజాన వేసుకొని కాలనీలో గొప్ప పేరు ప్రఖ్యాతలు గాంచడం చిరస్మరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
