Government | వీబీజీ రామ్ జీ పథకాన్ని రద్దు చేయాలి..

Government | వీబీజీ రామ్ జీ పథకాన్ని రద్దు చేయాలి..
Government | జైనూర్, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం వీబీజీ రామ్ జీ ఉపాధి హామీ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టిందని, ఆ పథకాన్ని రద్దు చేసి గత కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకా(Employment Guarantee Scheme)న్ని యధావిధిగా అమలు చేయాలని రామ్ నాయక్ తండా నూతన సర్పంచ్ రాందాస్ రాథోడ్ డిమాండ్ చేశారు.
ఇవాళ కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రామ్ నాయక్ తండ గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ రాథోడ్ రాందాస్ ఆధ్వర్యంలో నాయకులు, వార్డు మెంబర్లు, కూలీలు, కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన వీబీజీ రామ్ జీ ఉపాధి హామీ కొత్త పథకాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రచురించిన కరపత్రాలను విడుదల చేశారు. వెంటనే ప్రభుత్వం ఆ పథకాన్ని రద్దు చేయాలని నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.
ఈసందర్భంగా సర్పంచ్ రాథోడ్ రాందాస్ మాట్లాడుతూ… గత మహాత్మగాంధీ(Mahatma Gandhi) ఉపాధి హామీ పథకాన్నే కొనసాగించాలని మహాత్మ గాంధీ ఉపాధి హామీ పథకం ద్వారా కూలి నాలి చేసే ప్రజలతో పాటు అట్టడుగు వర్గాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని వారు డిమాండ్ చేశారు. జాతీయ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని మార్చడం సరికాదన్నారు.
నిరుపేదలకు ఉపాధి కల్పించడానికి గత ప్రభుత్వం(Government) ప్రవేశపెడితే కేంద్ర ప్రభుత్వం పథకాన్ని పేరు మార్చడం సమంజసం కాదన్నారు. పాత పథకాన్నికొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రామ్ నాయక్ తండ సర్పంచ్ తో పాటు ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, నాయకులు, కూలీలు, ప్రజలు పాల్గొన్నారు.
