Veldanda | జంగయ్య మృతి బాధాకరం

Veldanda | జంగయ్య మృతి బాధాకరం

  • బీఆర్‌ఎస్ మాజీ మండల అధ్యక్షులు కానుగుల జోగయ్య

Veldanda | వెల్దండ, ఆంధ్రప్రభ : మోక్తాలా జంగయ్య మృతి చెందడం బాధాకరమని బీఆర్‌ఎస్ మాజీ మండల అధ్యక్షులు కానుగుల జోగయ్య అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండల కేంద్రానికి చెందిన మోక్తాల జంగయ్య శనివారం అనారోగ్యంతో మరణించాడు. ఈ రోజు జోగయ్య మృతదేహానికి పూలమాలలు వేసి మృతుని కుటుంబ స‌భ్యుల‌కు రూ.5వేలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ జంగిలి నిరంజన్, మాజీ ఎంపీటీసీ చలిచీమల నిరంజన్, బీజేపీ కల్వకుర్తి తాలూక ఇన్‌చార్జి యన్నం శేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ 12వ వార్డు మెంబర్ సిర్సనగండ్ల శేఖర్, 4వ వార్డు మెంబర్ జంగిలి ఆనంద్, యువకులు సైదులు, భాస్కర్, కోట్ల శేఖర్, ఉడుత శేఖర్, అనిల్, రాజు, మదిరం మల్లేష్, పిల్లి శ్రీను, తుంగ శ్రీను, కుర్మిద్దె యాదగిరి, చిన్న పెద్దయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply