CPI | ఉపాధి చట్టం మార్పుపై ఉద్యమించాలి

CPI | ఉపాధి చట్టం మార్పుపై ఉద్యమించాలి

  • సీపీఎం నాయకులు గోవిందరావు

CPI | శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రక్షణ కోసం ఐక్యంగా ఉద్యమించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు ఎస్.కృష్ణవేణి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈశ్వరి డిమాండ్ చేశారు. ఈ రోజు స్థానిక సీపీఎం కార్యాలయంలో కే.మోహన్ రావు అధ్య‌క్షతన జరిగిన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో వారు మాట్లాడుతూ, కోట్లాదిమంది పేదలకు తోడుగా ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం రాం రాం పలికిందని ఆగ్రహిస్తూ.. ఈ పథకం స్థానంలో జీ రాం జీ పేరుతో కొత్త చట్టం చేసిందని, ఇది కేవలం పేరు మార్పు మాత్రమే కాదని, ఈ పథకం నిర్వీర్యం చేయడానికే అని వారన్నారు.

టిడిపి, జనసేన పార్టీల మద్దతు లేకుండా కేంద్ర ప్రభుత్వం ఒక్కరోజు దేశాన్ని పాలించలేదని, కీలక మద్దతు దారులుగా ఉన్న ఈ రెండు పార్టీలు ఈ వినాశకర బిల్లును ఎందుకు వ్యతిరేకించడం లేదని వారు ప్రశ్నించారు. గత 11 సంవత్సరాల కు పైగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి తమ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ మతతత్వ ఎజెండాను అమలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తుంద‌ని, అందుకే పేరు మార్చి తద్వారా కార్పొరేట్లకు నమ్మకంగా సేవ చేస్తుంద‌న్నారు. కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసం గతంలో వ్యవసాయ చట్టాలు తెచ్చి భంగపడ్డ బిజెపి ప్రభుత్వం ఇప్పుడు లేబర్ కోడ్స్ తెచ్చిందని ఆరోపించారు. ఉపాధి చట్ట సవరణ, అటవీ చట్టాలను మార్చివేసింది అని వారన్నారు.

అనకాపల్లి జిల్లా రైతు సంఘం జిల్లా కార్యదర్శి అప్పలరాజు పై పీడీ యాక్ట్ పెట్టి అక్రమంగా అరెస్టు చేయడాన్ని రౌండ్ టేబుల్ సమావేశం తీవ్రంగా ఖండించింది. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు బవిరి కృష్ణమూర్తి, కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పాలాకి ప్రసాదరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి లండ వెంకట్రావు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వెలమల రమణ, సీఐటీయూ జిల్లా కోశాధికారి అల్లు సత్యనారాయణ, పట్టణ సంక్షేమ సంఘం నాయకులు గోవర్ధన రావు, ఏఐవైఎఫ్ నాయకులు బొత్స సంతు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply