Ashes series | ఒక్క రోజే 20 వికెట్లు!

Ashes series | ఒక్క రోజే 20 వికెట్లు!
- యాషెస్ నాలుగో టెస్టులో బౌలర్ల హవా
- ఆస్ట్రేలియా 152, ఇంగ్లండ్ 110
- ఆలౌట్ అయిన ఇరు జట్లు
Ashes series | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : యాషెస్ సిరీస్ భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ (test match) జరుగుతోంది. మెల్బోర్న్ వేదికగా జరగుతున్న ఈ మ్యాచ్‌లో బౌలర్ల హవా కొనసాగుతోంది. ఇరు జట్ల బౌలర్లు రెచ్చిపోవడంతో తొలి రోజే 20 వికెట్లు పడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఆసీస్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 152 పరుగులకు ఆలౌట్ అయ్యింది. తర్వాత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 29.5 ఓవర్లలోనే 110 పరుగులకు కుప్పకూలింది. ప్రస్తుంతం ఇంగ్లిష్ జట్లు 42 పరుగుల వెనకంజలో ఉంది. ఈ మ్యాచ్‌లో ఒక్క రోజులోనే 20 వికెట్లు పడటం గమనార్హం. ఇరు జట్లలో ఏ ఒక్క బ్యాటర్ కూడా కనీసం హాఫ్ సెంచరీ చేయలేకపోయాడు.
