Ys Jagan | ఘనంగా పుట్టినరోజు వేడుకలు

Ys Jagan | ఘనంగా పుట్టినరోజు వేడుకలు
Ys Jagan | పామర్రు, ఆంధ్రప్రభ : పామర్రు టౌన్ లో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధినేత వై.యస్.జగన్మోహన్ రెడ్డి (Ys Jaganmohan Reddy) పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి పామర్రు మాజీ శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఉండ్రపూడిలో జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆంజనేయ స్వామి ఆలయంలో పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.
