Central Govt MP Funds | అభివృద్ధి చేసి చూపిస్తాం..

Central Govt MP Funds | అభివృద్ధి చేసి చూపిస్తాం..
- బీజేపీ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.భాస్కర్
Central Govt MP Funds | ఊట్కూర్, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వ ఎంపీ నిధులతో ఊట్కూర్ పట్టణాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తామని బీజేపీ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి ఎం.భాస్కర్, సర్పంచు ఎం. రేణుక భరత్ అన్నారు. శుక్రవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని ఎల్బీనగర్ వీధిలో నూతనంగా గెలుపొందిన సర్పంచ్ రేణుక భరత్, ఉప సర్పంచ్ రమేష్‌ను మైనార్టీ నాయకులు ఘనంగా సన్మానించి అభినందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలకతీతంగా గ్రామాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా నెరవేర్చి ప్రజల రుణం తీర్చుకుంటామన్నారు. అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు కృష్ణయ్య గౌడ్, రమేష్, లక్ష్మణ్, ఆశప్ప, ఇబ్రహీం పటేల్, జమీర్ అలీ, మాజీద్ సాబ్, నగిరి మహిముద్, తదితరులు పాల్గొన్నారు.
