Anganwadi Workers | 5జీ సెల్‌ఫోన్ల పంపిణీ

Anganwadi Workers | 5జీ సెల్‌ఫోన్ల పంపిణీ

Anganwadi Workers | పామర్రు, ఆంధ్రప్రభ : పామర్రు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ప్రధాన, మినీ అంగన్వాడీ కార్యకర్తలకు 5జీ సెల్‌ఫోన్లను లాంఛనంగా అందజేశారు. ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ల పంపిణీ అనేది అంగన్వాడీ కార్యకర్తల పని భారాన్ని తగ్గించి, వారికి సాంకేతిక బలాన్ని అందించడానికి ప్రభుత్వం తీసుకున్న చారిత్రక నిర్ణయమని ఎమ్మెల్యే తెలిపారు. దీని ద్వారా గ్రామీణ స్థాయిలో పోషణ, ఆరోగ్య సేవల అమలు మరింత పారదర్శకంగా, వేగంగా జరుగుతుందని వర్ల కుమార్ రాజా పేర్కొన్నారు.

స్మార్ట్‌ఫోన్ల పంపిణీతో పాటు, అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా, మినీ కార్యకర్తలకు, మెయిన్ అంగన్వాడి కార్యకర్తలుగా తాత్కాలిక నియామక ఉత్తర్వులను కూడా శాసన సభ్యులు చేతుల మీదుగా అందజేశారు. ఈ చర్య ద్వారా సేవల విస్తరణ, బాధ్యతల స్పష్టత మరింత మెరుగుపడనున్నాయి. ఈ డిజిటల్ అప్‌గ్రేడ్ ద్వారా అంగన్వాడీ సేవల పై సమగ్రమైన రియల్-టైమ్ డేటా ప్రభుత్వానికి అందుబాటులోకి వచ్చి, పథకాల మానిటరింగ్ మరింత ప్రభావవంతంగా మారనుంది. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply