Current shock | విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం

Current shock | విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం
- నిండు ప్రాణం బలి
- సెల్ ఫోన్ చార్జింగ్ పెడుతుండగా వ్యక్తి మృతి
- గతంలో పిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆగ్రహం
- మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని ధర్నా
Current shock | పెన్ పహాడ్, ఆంధ్రప్రభ: సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం గూడెపుకుంట తండా గ్రామంలో భూక్యా సైదా కుమారుడు భూక్య హరిలాల్ (28) మంగళవారం రాత్రి తన ఇంట్లో సెల్ ఫోన్‌కు ఛార్జింగ్ పెడుతుండగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి కుమారుడు, భార్య భూక్యా అనిత ఉన్నారు. వీరితోపాటు ఆ గ్రామంలో భూక్యశీను, భూక్య మోహన్, భూక్య మస్తాన్, భూక్య సైదా వీరి గృహాల్లో కూడా టీవీ, ఫ్రిడ్జ్ పట్టుకోగా చేతి వేళ్లకు విద్యుత్ షార్ట్ తగిలింది.

అదేవిధంగా గ్రామంలో ట్రాన్స్ ఫార్మర్ నుండి విద్యుత్ డైరెక్ట్ సప్లై అవుతుండగా.. ఈ విషయాన్ని గతంలో జేఎల్‌ఎంకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని ఆరోపించారు. విద్యుత్ అధికారులు నిర్లక్ష్యం కారణంగానే హరిలాల్ మృతి చెందాడని కుటుంబ సభ్యులు. గ్రామస్తులు ఆరోపించారు. పోలీస్ స్టేషన్ ఎదుట శవాన్ని ఉంచి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సుమారు 2 గంటలకు పైగా ప్రధాన రహదారిపై ధర్నా చేశారు. కుటుంబానికి న్యాయం జరిగే వరకు ధర్నా విరమించే లేదని స్పష్టం చేశారు.
