Kasna Thanda | అభివృద్ధి చేస్తా..

Kasna Thanda | అభివృద్ధి చేస్తా..
Kasna Thanda, నెల్లికుదురు, ఆంధ్రప్రభ : నెల్లికుదురు మండలంలోని కస్న తండా గ్రామ సర్పంచ్ గా తమను గెలిపిస్తే.. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి బోడ నరసింహ అన్నారు. గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్ అభ్యర్థగా బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన తనను అధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండేళ్లలో గ్రామాల అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే గ్రామాల అభివృద్ధి జరిగిందన్నారు. గ్రామంలో ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు ఎలాంటి లోటు రాకుండా నిత్యం గ్రామంలోనే వుంటూ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తానన్నారు. తనతో పాటు, అన్ని వార్డుల అభ్యర్థులను అధిక మెజారిటితో గెలిపించాలని ప్రజలను కోరారు.
