BJLP | ఎమ్మెల్యే సమక్షంలో బీజేపీలో చేరిక
BJLP | సోన్, ఆంధ్రప్రభ : సొన్ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ (Congress) పార్టీ ముఖ్య నాయకులు దాసరి శ్రీనివాస్, సొండి గంగయ్య లు ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, నాయకులు రావుల రాంనాథ్, మండల నాయకులు డా.నరేష్, బోనగిరి నర్సయ్య, సంతోష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.


