Minister | విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించాలి

Minister | విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించాలి
- మంత్రి అచ్చెన్నాయుడు
Minister | టెక్కలి(శ్రీకాకుళం), ఆంధ్రప్రభ : విద్యతో పాటు విద్యార్థుల్లో వివిధ నైపుణ్యాలను అభివృద్ధి చేసే దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు(Kinjarapu Atchannaidu) సూచించారు. టెక్కలి జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ మీటింగ్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వ పాఠశాలల్లో ఈ మెగా పేరెంట్ మీటింగ్(Mega parent meeting)లు నిర్వహిస్తున్నామని, విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని తెలిపారు.
అభ్యసన ఫలితాలే లక్ష్యంగా పాఠశాల విద్యలో నూతన సంస్కరణలు తీసుకురాబోతున్నామని మంత్రి ప్రకటించారు. డీఎస్సీ అంటే టీడీపీ… టీడీపీ అంటే డీఎస్సీ అని పేర్కొన్న మంత్రి అచ్చెన్నాయుడు, తమ ప్రభుత్వం 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకుందని స్పష్టం చేశారు. గతంలో ప్రభుత్వ పాఠశాలలు మూతపడే పరిస్థితి ఉండేదని, కానీ ఇప్పుడు ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు, విద్యకు ఇస్తున్న ప్రాధాన్యత కారణంగా(Because of priority) అవి మళ్లీ తెరుచుకుంటున్నాయని అన్నారు.
దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ.రామారావు ప్రాతినిథ్యం వహించిన టెక్కలి నియోజకవర్గ అభివృద్ధికి తాను పూర్తిగా కట్టుబడి ఉన్నానని, గత ప్రభుత్వ హయాంలో అటకెక్కిన అభివృద్ధి ఇప్పుడు పరుగులు పెడుతోందని ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్(Swapnil Dinakar Pundkar) మాట్లాడుతూ, మెగా పేరెంట్ టీచర్ సమావేశాల ముఖ్య ఉద్దేశాన్ని గురించి వివరించారు.

ఈ సందర్భంగా మంత్రి ఉపాధ్యాయులు, విద్యార్థులతో ఆప్యాయంగా మమేకమై వారి ప్రగతి నివేదికలు, విద్యా ప్రమాణాలను వ్యక్తిగతంగా పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల(Infrastructure) అభివృద్ధికి ప్రభుత్వం 4 వేల కోట్ల రూపాయలతో కృషి చేస్తున్నదని, ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తగ్గకుండా ప్రభుత్వ పాఠశాలలను ఆధునికీకరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పేరెంట్-టీచర్ మీటింగ్ అనంతరం విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి పాఠశాలలో ఉన్న వసతులు, బోధన నాణ్యత, మధ్యాహ్న భోజన ప్రమాణాలపై చర్చించిన మంత్రి… వారితో కలిసి సహపంక్తి భోజనం(Companion meal) చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఆర్డీవో కృష్ణమూర్తి, పాఠశాల ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున విద్యార్థుల తల్లిదండ్రులు హాజరు కావడంతో పండగ వాతావరణం నెలకొంది.
