ఇద్దరు దుర్మరణం

ఇద్దరు దుర్మరణం
ఓవర్ టేక్ .. బైక్ స్కిడ్
- మరొకరి పరిస్థితి విషమం
- కర్నూలులో ఘోర ప్రమాదం
( కర్నూలు, ఆంధ్రప్రభ బ్యూరో)
కర్నూలు సంతోష్‌నగర్ సమీపంలోని జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకొని గూడూరుకు చెందిన ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది.
వివరాలు ఇలా ఉన్నాయి. సాక్షుల వివరాల ప్రకారం, ద్విచక్ర వాహనంపై ముగ్గురు యువకులు కర్నూలు వైపు వస్తుండగా, ముందుకు వెళ్తున్న టిప్పర్‌ను అతివేగంగా ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించారు. ఆ క్షణంలో వాహనం నియంత్రణ కోల్పోవడంతో బైక్ నేరుగా టిప్పర్‌ను ఢీకొంది. చంద్రశేఖర్ (31), నవీన్ (32) అక్కడికక్కడే మృతి చెందగా సుమన్ (32) తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. నాలుగో పట్టణ పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
