Manchiryala | ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్న స్థానికులు
Manchiryala | ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్న స్థానికులు
Manchiryala | నస్పూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల(Manchiryala) జిల్లా నస్పూర్ పట్టణ సమీపంలోని తాళ్లపల్లి గ్రామంలో ఇసుక ట్రాక్టర్ల(Sand tractors)ను ఈ రోజు స్థానికులు అడ్డుకున్నారు.
గతవారం రోజులుగా ఆన్లైన్(online) ఇసుక ప్రారంభం కావడంతో తాళ్ల పెళ్లి సమీపంలోని గోదావరి నది నుండి ఇసుక తీసుకుని వెళ్లే ట్రాక్టర్లు అత్యధిక సంఖ్యలో వెళుతుండడంతో స్థానికంగా ఉండే ఇండ్లలోని వారికి దుమ్ము, ధూళి, అధిక శబ్దకాలుష్యం వస్తుండడంతో స్థానిక ప్రజలు ఇసుక ట్రాక్టర్లను నిలిపివేశారు. ఇసుక వాహనాలు ప్రత్యామ్నాయ రోడ్డు మార్గాల ద్వారా వెళ్లాల్సిందిగా డిమాండ్ చేశారు.
