MLA | ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవం…

MLA | ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవం…

MLA | మాడుగుల పల్లి, ఆంధ్రప్రభ : మహిళలు చిత్తశుద్ధితో ముందుకెళ్లాలని మహిళ కోసం మహిళనే అండగా నిలబడాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఈ రోజు ఆమె మండల పరిధిలోని పోరెడ్డి గూడెంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి(MLA Battula Lakshmareddy), ఎమ్మెల్సీ శంకర్ నాయక్ లతో కలిసి ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం కార్యక్రమం నిర్వహించారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇల్లు పథకం పేద కుటుంబాలకు గౌరవప్రదమైన నివాసాన్ని అందిస్తోందని కలెక్టర్ అన్నారు. మిర్యాలగూడ శాసనసభ్యులు భత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం(State Govt) మహిళలు అన్ని రకాలుగా అభివృద్ధి సాధించేందుకు ఉచిత బస్సు ప్రయాణంతోపాటు వడ్డీ లేని రుణాలు ఇందిరా మహిళ శక్తి చీరలు తదితర సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదని తెలిపారు.

ఇల్లు లేని నిరుపేదలకు 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నదని వీటన్నిటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అనంతరం శాసనసభ్యులు, ఎమ్మెల్సీ జిల్లా కలెక్టర్ మహిళలకు ఇందిర మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ గృహ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్ తాసిల్దార్ సరోజ పావని ఏపిఎం మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply