Gummadidala | విద్యుత్ వైర్లు తగిలి…

Gummadidala | విద్యుత్ వైర్లు తగిలి…

హార్వెస్టర్ బుగ్గి
పొలంలో వరికోత సమయంలో సంఘటన
ప్రాణాపాయం జరగక పోవడంతో ఊపిరి పీల్చుకున్న రైతులు


Gummadidala | గుమ్మడిదల, ఆంధ్ర ప్రభ : గుమ్మడిదల (Gummadidala) మున్సిపల్ పరిధిలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి హార్వెస్టర్ (Harvester) బుగ్గి ఐన సంఘటన చోటుచేసుకుంది. మున్సిపల్ పరిధిలోని బొంతపల్లి వార్డులో గల అయ్యప్ప ఆలయ వెనుక భాగంలో ఉన్న రైతు వరిపైరును కోసేందుకు హార్వెస్టర్ పొలంలోకి వచ్చింది.

ఆ సమయంలో డ్రైవర్ పైన ఉన్నటువంటి విద్యుత్ తీగలను గమనించకపోవడంతో విద్యుత్ తీగలు (Electrical wires) తగిలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆసమయంలో డ్రైవర్ గమనించి వెంటనే మిషన్ పై నుండి పక్కకు దూకడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.. కానీ విద్యుత్ షాక్ తో హార్వెస్టర్ (Harvester) పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఎలాంటి ప్రాణహాని జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Leave a Reply