Speaker | జగన్మాతకు స్పీకర్ పూజ‌లు

  • కుటుంబ సమేతంగా ఆల‌య ద‌ర్శ‌నం
  • ఘన స్వాగతం ప‌లికిన దేవాల‌య సిబ్బంది

Speaker | విజయవాడ, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో కొలువైన‌ కనకదుర్గమ్మ వారిని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కుటుంబ సమేతంగా ద‌ర్శించుకున్నారు. సోమవారం ఉదయం ఆలయానికి విచ్చేసిన ఆయనకు ప్రధానాలయ ఏఈఓ బీవీ రెడ్డి, సూప‌రింటెండెంట్ చందు శ్రీను, ప్రొటోకాల్ సూపరింటెండెంట్ ఎల్. శ్రీనివాసులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

తెల్లవారుజామున అమ్మవారికి నిర్వహించే ఖడ్గమాలార్చన సేవలో పాల్గొన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు దంపతులు స్వయంగా టికెట్ కొనుగోలు చేసి పూజల్లో పాల్గొన్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులను తీర్చుకున్నారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు స్పీకర్ అయ్యన్నపాత్రుడు దంపతులకు అమ్మవారి చిత్రపటం, శేష వస్త్రంతో పాటు ప్రసాదాలను అందజేశారు.

Leave a Reply